ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) లో భాగంగా గుజరాత్ జెయింట్స్ విమెన్ (Gujarat Giants Women) , యూపీ వారియర్స్ విమెన్ (UP Warriors Women) జట్ల మధ్య జరుగువుతోన్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్ల లో నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్టార్ ఓపెనర్ బెత్ మూనీ 13 పరుగులు చేసి అవుట్ అయ్యింది మరో ఓపెనర్ సోఫీ డివైన్ ధాటిగా ఆడి 20 బంతుల్లోనే 38 పరుగులు చేసింది. 55 పరుగులకు ఓపెనర్లిద్దరిని కోల్పోయిన గుజరాత్ జెయింట్స్ ను కెప్టెన్ యాష్లే గార్డనర్, అనుష్క శర్మ లు మూడవ వికెట్ కు 103 పరుగులు జోడించి ఆదుకున్నారు.
30 బంతుల్లో 44 పరుగులు చేసిన అనుష్క శర్మ అవుట్ అయిన తరవాత కాసేపటికే 41 బంతుల్లో 65 పరుగులు చేసిన గార్డనర్ కూడా అవుట్ అయ్యింది. అయితే ఆఖర్లో వచ్చిన వారెహామ్, ఫుల్మలీ లు బ్యాట్ ఝులిపించారు. వారెహామ్ 10 బంతుల్లో 27 పరుగులు , ఫుల్మలీ 7 బంతుల్లో 14 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో జట్టు స్కోర్ 200 పరుగులు దాటింది
యూపీ వారియర్స్ ఉమెన్ బౌలర్లలో ఎకిల్ స్టోన్ రెండు వికెట్లు తీసుకోగా శిఖా పాండే, డాటిన్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు

