మలేషియా ఓపెన్ : సెమీఫైనల్ లో సింధు ఓటమి

by | Jan 10, 2026 | వార్తలు

మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ 1000 బాడ్మింటన్ టోర్నమెంట్ లో మన దేశానికి చెందిన పి వి సింధు సెమి ఫైనల్ లో ఓటమితో టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది

ఎనిమిది సంవత్సరాల తరవాత మలేషియన్ ఓపెన్  సెమి ఫైనల్ కు చేరిన సింధు, ఈ రోజు జరిగిన సెమి ఫైనల్ లో  చైనా కు చెందిన వాంగ్ జి యి చేతిలో వరుస గేమ్ లలో 16-21, 15-21 తో ఓటమిపాలైంది.  క్వార్టర్ ఫైనల్ లో సింధు 21-11 తో మొదటి గేమ్ గెలిచాక, యమగుచి గాయంతో వైదొలగడం తో సెమి ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే

ఎంత బాగా ఆడిన మనది కానీ రోజున మనం ఏమి చేయలేము. పి వి సింధు పోరాటాన్ని అభినందించాల్సిందే.