WPL : మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఆర్సీబీ విజయం

by | Jan 10, 2026 | వార్తలు

ఉమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premiere League) లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ను సజీవన్ సజన, నికోలా క్యారీ లు ఐదవ వికెట్ కు 82 పరుగులు జోడించి ఆదుకున్నారు.  సజీవన్ సజన 45 పరుగులు , నికోలా క్యారీ 40 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు. అంతకు ముందు కెర్, బ్రన్ట్ లు నాలుగేసి పరుగులు చేసి అవుట్ అయ్యారు.  కమలిని 32 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు

ఆర్సీబీ (Royal Challengers Bangalore) బౌలర్లలో నదినే డి క్లర్క్ నాలుగు వికెట్లు తీసుకోగా, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు

అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో ఆర్సీబీ కు కెప్టెన్ స్మ్రితి మందన, హరీస్ లు మొదటి వికెట్ కు 40 పరుగులు జోడించి చక్కని శుభారంభాన్ని అందించారు. అయితే హారిస్ 25 పరుగులు, మందన 18 పరుగులు చేసి అవుట్ ఆయిన తరవాత వచ్చిన హేమలత(7 పరుగులు), రిచా ఘోష్ (6 పరుగులు),  రాధా యాదవ్ (1 పరుగు) లు వెంట వెంటనే అవుట్ అవడంతో 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది

అయితే ఆ తరవాత వచ్చిన నదిన్ డి క్లర్క్ అద్భుతంగా ఆడి 44 బంతుల్లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.  క్లర్క్ బౌలింగ్ లోను రాణించి 4 వికెట్లు తీసుకుంది. 20 పరుగులు చేసిన అరుంధతి రెడ్డి క్లర్క్ కు చక్కని సహకారాన్ని అందించింది

ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమీలియా కెర్, నికోలా క్యారీ లు చెరో రెండు వికెట్లు తీసుకోగా, అమన్ జోత్ కౌర్, ఇస్మాయిల్, బృంట్ లు తల ఒక వికెట్ తీసుకున్నారు

63 పరుగులు, నాలుగు వికెట్ల తో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి అల్ రౌండ్ ప్రదర్శన చేసిన నదిన్ డి క్లర్క్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది