‘CHIRU’  అనే అక్షరాలను పడవలతో పేర్చిన రాజముండ్రి  ఫ్యాన్స్

by | Jan 4, 2026 | సినిమా

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ప్రొమోషన్స్ రాజముండ్రి లో ఘనంగా ప్రారంభమయ్యాయి

రాజముండ్రి రేవులో రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి ఆధ్వర్యంలో మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం తాలూకా ప్రచార సంబరాలు ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమాలలో రాజమండ్రి ఏం ఎల్ ఎ ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు.  ఇంత గొప్ప అభిమాన సంపద చిరంజీవి గారికి మాత్రమే ఉంది అని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.

రాజముండ్రి రేవులో  చిరు అనే అక్షరాలను సుమారు 40 పడవలతో పేర్చి మెగా అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచారు

ఈ రోజు మన శంకర వర ప్రసాద్ గారు చిత్ర ట్రైలర్ తిరుపతిలో విడుదల చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. వచ్చే ఆదివారం మన శంకర వర ప్రసాద్ గారు ప్రీమియర్ సందడి మొదలవబోతోంది.