పూరి జగన్నాధ్, ఒకప్పుడు ఈ పేరు కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజ మౌళి ఆశ్చర్యపోయేవాడు. అంత స్పీడుగా సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లు ఎలా కొడుతున్నావు అని అడిగేవాడు
అయితే రోజులు మారాయి. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఓ టి టి లు వచ్చాయి. ప్రేక్షకుడు ఏ సినిమా థియేటర్లో చూడాలి, ఏ సినిమా ఓ టి టి లో చూడాలి అని లెక్కలు వేసుకునే రోజులు.
ఇక్కడే పూరి జగన్నాధ్ వెనక పడిపోయాడు. పూరి జగన్నాధ్ చివరి 10 చిత్రాలలో 8 ప్లాప్ లు. రెండే సినిమాలు హిట్. అవి ఒకటి ఎన్టీఆర్ నటించిన టెంపర్, రెండవది రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాధ్ తీసిన మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్ కూడా ఘోర పరాజయాన్ని చవి చూసింది
అయితే ఇప్పుడు పూరి జగన్నాధ్ తమిళ నటుడు విజయ్ సేతుపతి తో జత కడుతున్నాడు. విజయ్ సేతుపతి మంచి నటుడు అందులో సందేహం లేదు. అయితే కధలో బలమున్నప్పుడే విజయ్ సేతుపతి సినిమాని నడిపించగలడు. ఈ మధ్య కాలం లో విజయ్ సేతుపతి నటించిన చిత్రాలు కూడా పరాజయం పాలవుతున్నాయి
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో అంటే హీరోగా నటించిన సినిమాలలో ఈ మధ్య కాలంలో విడుదలై న పార్ట్ 1, మహారాజ చిత్రాలు హిట్ అయ్యాయి. 2016-18, అంటే ఈ మూడు సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 4 సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు విజయ్ సేతుపతి. అయితే ఆ తరవాత విజయ్ సేతుపతి నటించిన సినిమాలు అంతగా ప్రజాదరణకు నోచుకోవడంలేదు. విజయ్ సేతుపతి విక్రమ్, జవాన్ సినిమాలలో విలన్ గా నటించి పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు కానీ, ఒంటరిగా పాన్ ఇండియా మార్కెట్ లేదు
ఇటువంటి పరిస్థితులలో పూరి జగన్నాధ్, విజయ్ సేతుపతి ల కలయిక ఆసక్తికరంగా మారింది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాధ, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూట్ జూన్ లో ప్రారంభమవుతుందని పూరి ఎక్స్ వేదికగా తెలిపారు. భారతీయ భాషలన్నిటిలో ఒక కళాఖండాన్ని తీయపబోతున్నట్లుగా పూరి కనెక్ట్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
https://twitter.com/PuriConnects/status/1906279771350212840


