WPL ఎలిమినేటర్ మ్యాచ్ : గుజరాత్ జెయింట్స్ లక్ష్యం 214 పరుగులు
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరుగుతోన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్ల లో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది
ఓపెనర్ యాస్తికా భాటియా 15 పరుగులే చేసి అవుట్ అయ్యినా, ఆ తరవాత వచ్చిన నాట్ సీవర్ బృంట్ తో కలిసి మరో ఓపెనర్ మాధ్యుస్ రెండవ వికెట్ కు 133 పరుగులు జోడించారు
50 బంతుల్లో 77 పరుగులు చేసి మాధ్యుస్ అవుట్ అయ్యిన తరవాత కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ వచ్చి రాగానే బాదుడు ఆరంభించింది. బృంట్, హర్మాన్ లు మూడవ వికెట్ కు ధాటిగా ఆడుతూ 39 పరుగులు జోడించాక, 41 బంతుల్లో 77 పరుగులు చేసిన బృంట్ అవుట్ అయ్యారు
కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ 12 బంతుల్లో 36 పరుగులు చేసి రన్ అవుట్ అయి వెనుతిరిగింది. ఇందులో 4 సిక్సర్ లు , 2 ఫోర్లు ఉన్నాయి
గుజరాత్ గెయింట్స్ బౌలర్ల లో గిబ్సన్ రెండు వికెట్లు తీయగా, గౌతమ్ ఒక వికెట్ తీశారు.


