7వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సినీరంగానికి ప్రాధాన్యత దక్కిన సంగతి తెలిసిందే. భారత సినీ రంగానికి విశిష్ట సేవలు అందించిన నట దిగ్గజాలకు కేంద్రం అత్యున్నత పురస్కారాలను అందించింది. తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ తో పాటుగా తమిళ నటుడు మాదవన్లకు పద్మశ్రీ (Padmasri) అవార్డు దక్కింది. మలయాళ నట దిగ్గజం మమ్ముట్టి, సింగర్ అల్కా యాజ్ఞిక్లకు పద్మ భూషణ్ అవార్డు వరించింది. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డుల దక్కింది.
ఇదిలావుంటే… పద్మ అవార్డు విజేతలకు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు (Dhrmendra) పద్మ విభూషణ్ దక్కడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. అలాగే తన మిత్రుడు అగ్ర హీరో మమ్ముట్టి తో పాటు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్ పురస్కారం రావడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే తన స్నేహితులు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మురళీ మోహన్ (Murali Mohan) తో పాటుగా సోదరుడు మాధవన్, మన ఛాంపియన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) , వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్లకు (Harman Preeth Kaur) పద్మశ్రీ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. కళలు, సైన్స్, వైద్యం, సాహిత్యం, క్రీడల రంగాలలో అత్యుత్తమ సేవలు అందించి ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ చిరంజీవి తెలిపారు.


