ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మేటి జట్లు ఖంగు తింటున్నాయి. ఐదేసి సార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ లు అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఐదు మ్యాచ్ లు ఆడి, ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి, నాలుగు మ్యాచ్ లు ఓడి పోయి పాయింట్ల పట్టిక లో అట్టడుగు స్థానంలో ఉన్నాయి. 2024 సీజన్ రన్నర్ అప్ సన్ రైజర్స్ హైదరాబాద్ ది ఇదే పరిస్థితి
అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో ఇప్పటి దాకా ఒక్క మ్యాచ్ ఓడిపోని జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది.
3 మ్యాచ్ ల విజయంతో 6 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అంతే కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నెట్ రన్ రేట్ కూడా 1.257 గా ఉంది. కొత్త, యువ కెప్టెన్లు ఉన్న జట్లు అన్ని ముందంజలో ఉన్నాయి
రెండవ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, కొత్తగా కెప్టెన్ అయినా రజత్ పటిదార్ సారధ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మూడవ స్థానంలో ఉంది. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలో బరిలో దిగింది
గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు కూడా కొత్త నాయకుల సారధ్యంలో, ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడింట విజయాలు సాధించి, ఢిల్లీ క్యాపిటల్స్ తరవాతి మూడు స్థానాలలో ఉన్నాయి

