‘SSMB29’: ఆ ఒక్క సీన్‌ కోసం అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా!

by | Apr 9, 2025 | సినిమా

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ సినిమా వ‌స్తుండ‌టంతో పాటు మ‌హేశ్ బాబు (Mahesh Babu), రాజ‌మౌళి (Rajamouli) కాంబోలో ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కాగా, ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు షెడ్యూల్ లను పూర్తి చేసిన రాజమౌళి మూడో షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా స‌మాచారం. అయితే ఈ మూవీలో కేవలం 5 నిమిషాల పాటు సాగే యాక్షన్ సీక్వెన్స్ సీన్ కోసమే ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ఈ సన్నివేశాన్ని హైదరాబాద్ లోనే చిత్రీకరించనునట్లు తెలుస్తోంది.

ఇక ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక సెట్ ని కూడా నిర్మించిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాను రూ. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆ లెక్కన మొత్తం బడ్జెట్ లో 10 శాతం కేవలం ఈ ఫైట్ సీన్ కోసమే ఖర్చు చేస్తుండటం విశేషం. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ సీక్వెన్ కు గ్రాఫిక్స్ వర్క్ కూడా అదే రేంజులో ఉంటుంద‌ట‌. అందుకే ఆ ఇంత మొత్తంలో ఖ‌ర్చు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ చిత్రం అమెజాన్‌ అడవుల (Amazon Forest) నేపథ్యంలో తెరకెక్కనుండగా.. దీనికి రామాయణంలోని (Ramayanam) కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని, మైథలాజికల్ గా తెరకెక్కించనున్నారని, ఈ కథ కాశీ (Kasi) నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇందులో హనుమంతుడి స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథను అందించారు