ఆర్మాక్స్ మీడియా నిర్వహించే మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ ఇన్ ఇండియా సర్వే ఫిబ్రవరి 2025 జాబితా విడుదలయింది
ఈ జాబితా లో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. తమిళ స్టార్ హీరో విజయ రెండవ స్థానంలో ఉండగా, పుష్ప 2 తో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నాలుగవ స్థానంలో ఉన్నాడు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఐదవ స్థానంలో ఉన్నాడు. ఇక ఆరవ స్థానంలో మహేష్ బాబు, ఏడవ స్థానంలో అజిత్ ఉండగా, ఎనిమిదవ స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. 9 వ స్థానంలో సల్మాన్ ఖాన్ ఉండగా, 10 వ స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు.
టాప్ టెన్ జాబితాలో ఉన్న 10 మందిలో 5 గురు తెలుగు స్టార్స్ కావడం విశేషం. మిగతా ఆరుగురి లో ఇద్దరు తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన వారయితే, మిగతా ముగ్గురు బాలీవుడ్ హీరోలు.
దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు, ఇండియన్ సినిమాని శాసించే స్థాయిలో తెలుగు సినిమా ఉందని.
ఆశ్చర్యకర విషయం ఏంటంటే పుష్ప 2 అంత పెద్ద హిట్ అయ్యి 1800 కోట్ల వసూళ్లు సాధించినా, ముఖ్యంగా పుష్ప 2 తెలుగు లో కన్నా హిందీ లోనే పెద్ద హిట్ అయ్యింది. అయినా, అల్లు అర్జున్ మూడవ స్థానంలోనే ఉన్నాడు .


