టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్’. ఈ చిత్రాన్ని మెగా స్టార్ చిరంజీవి ప్రశంసించారు.
ఈ చిత్రంలో నటించిన ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, సీనియర్ నటుడు శివాజీ లను ఇంటికి పిలిపించుకుని సత్కరించారు. వారితో కలిసి ఫోటో లు దిగారు.
స్టార్స్ ఎవరు లేకపోయినా కేవలం కంటెంట్ మీద ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది
దీనిపై నాని ట్వీట్ చేశారు. నేను భారత దేశంలో లేకపోవడం వలన రాలేకపోయాను. కానీ నా మనసంతా ఇక్కడే ఉంది. మా టీం కు జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకాలు ఇచ్చారు. మీ ప్రేమ, అభిమానులకు ధన్యవాదాలు అని నాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. పెద్దగా కమర్షియల్ అంశాల్లేకుండా కంటెంట్ కి కట్టుబడి తీసిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తోంది.

