ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
152 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ కు ఓపెనర్లు క్విన్టన్ డికాక్, మొయిన్ అలీ లు మొదటి వికెట్ కు 41 పరుగులు జోడించాక 5 పరుగులు చేసిన మొయిన్ అలీ రన్ అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన కెప్టెన్ రహానే కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోయారు. 18 పరుగులు చేసిన రహానే హాసరంగ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
అయితే ఆ తరవాత వచ్చిన రఘువంశీ తో జత కలిసిన క్విన్టన్ డికాక్ మరో వికెట్ పడకుండానే కోల్ కతా నైట్ రైడర్స్ ను గెలిపించారు. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ డికాక్ 61 బంతుల్లో, 6 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 97 పరుగులు, రఘువంశీ 22 పరుగులతో అజేయంగా నిలిచారు
కోల్ కతా నైట్ రైడర్స్ 17.3 ఓవర్ల లో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది
అంతకు ముందు టాస్ గెలిచిన కె కె ఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఓపెనర్లు జైస్వాల్ 29 పరుగులు, సంజు శాంసన్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు
కెప్టెన్ రియాన్ పరాగ్ 3 సిక్సర్లు బాది మంచి ఊపుమీదున్న తరుణంలో 15 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నితీష్ రానా, వనిందు హాసరంగా, శుభమ్ దూబే లు తక్కువ పరుగులు చేసి అవుట్ అయ్యారు
ధృవ్ జురెల్ కొంత సేపు క్రీజ్ లో నిలబడి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో ధృవ్ జురెల్ టాప్ స్కోరర్
ఆఖర్లో ఆర్చర్ రెండు సిక్స్ లు బాదడంతో కె కె ఆర్ ఈ మాత్రం స్కోర్ చేసింది
కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, హర్షిత్ రానా, వైభవ్ అరోరా లు రెండేసి వికెట్ల చొప్పున తీశారు. జాన్సన్ ఒక వికెట్ తీశాడు

