టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగ చైతన్య ఇటీవలే తండేల్ మూవీతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం తండేల్ విజయాన్ని ఆస్వాదిస్తున్న నాగ చైతన్య తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగ చైతన్య (Naga Chaitanya). గతేడాది చైతూ బర్త్ డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ఎన్‌సీ24’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బోగవల్లి ప్రసాద్-సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో నాగ చైతన్యకు (Naga Chaitanya) జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారట. మార్చి చివర్లో కొత్త షెడ్యూల్ మొదలవనుందని తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందనున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించనుండగా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

