పవన్ కల్యాణ్ అభిమానులు నన్ను భయ భ్రాంతులకు గురి చేశారు: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పంట భూమి పూజ కోసం కర్నూల్ జిల్లా లో ఓర్వకల్లు మండలంలో పూడిచర్ల కు వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీ మాట్లాడబోతుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు అరుపులు కేకలతో హోరెత్తించారు. సర్ మా స్పీచ్ ఎవరు వినరు. కేవలం మిమ్మల్ని చూస్తూ ఉండిపోయారు మా ప్రజలు అన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్, మేడమ్, వాళ్ళు అభిమానులు కాదు దేశ భక్తులు మీరు మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
నేను కూడా పవన్ కల్యాణ్ గారు ఫ్యాన్ ని అని అన్నారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీ. నేను ఏం బి బి ఎస్ మొదటి సంవత్సరం చదివేటప్పుడు మీ ఫాన్స్ నన్ను భయ భ్రాంతులకు గురి చేశారు. నేను కాలేజీ అడుగుపెట్టగానే మొదటగా నన్ను మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు. నేను గొప్పగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను. ఒక వందమంది నన్ను చుట్టూ ముట్టేశారు. మేము పవన్ కళ్యాణ్ గారి ఫాన్స్. నువ్వు ఏంటి అని అన్నారు. అప్పటి నుండి మీ పేరు ఒక సంవత్సరం పాటు ఎత్తలేదు
ఇంకా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీ మాట్లాడుతూ ప్రజల వెంట ఉండే నాయకుడు, ప్రజల కష్టాలు తెలుసుకునే నాయకుడు మన ముందుకు వచ్చి వారం ముందే ఉగాది పండుగ జరుపుకుంటున్నామంటే దానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి ధన్యవాదాలు తెలిపారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరీ

