బెట్టింగ్ యాప్స్ వివాదం – వాళ్ళైనా, వీళ్ళయినా ఈజీ మనీ కోసమే

by | Mar 20, 2025 | వార్తలు

బెట్టింగ్స్ యాప్స్ వివాదం రోజు రోజుకి పెద్దదవుతోంది.  ఇప్పుడు కొత్తగా ఈ వివాదం లో నటులు రానా, విజయ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత లు ఉన్నారు అని తెలిసింది

అంతకు ముందు సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల అయిన  వైస్సార్సీపీ  అధికార ప్రతినిధి శ్యామల తో పాటు అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీ ముఖి, వర్షిణి సౌందరరాజన్,వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి,నాయని పావని, నేహా పఠాన్,పండు, పద్మావతీ, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియా, హర్ష సాయి,బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, సుప్రీతా  ఉన్నారు

వైస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రెస్ మీట్ లు పెట్టి మరి కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటుంది.  చంద్రబాబు నాయుడు వయసు, అనుభవం ముందు శ్యామల  జ్ఞానం, పరిజ్ఞానం ఏపాటిదో కూడా తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వం పై, పవన్ కల్యాణ్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఎన్నో నీతులు చెప్పే వైస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉండడం విశేషం. 

ఇవన్నీ పక్కన పెడితే ప్రెస్ మీట్ లలో నీతులు చెప్పే వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుందా, అంత ధైర్యం ఉందా, దీనికి ఏం సమాధానం చెపుతుంది

 ఇక్కడ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు అయినా, వీరి మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులయినా ఈజీ మనీ కోసం అలవాటు పడ్డవాళ్లే.  అయితే  దీని ప్రభావం బాధితుల జీవితాల మీద పడుతోంది. కానీ ప్రమోట్ చేసిన సెలబ్రిటీ మరియు ఇన్ ఫ్లుయెన్సర్లు అయినా వీరందరూ డబ్బు బాగానే సంపాదిస్తున్నారుగా ఎందుకు ఈ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ మాయలో పడ్డారు.  బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ ద్వారా ఇప్పటి దాగా వీరందరూ ఎంత సంపాదించారు. 

ఈ బెట్టింగ్ యాప్ ల ను ప్రమోట్ చేసిన వారు ఈ బెట్టింగ్ యాప్ లలో ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటిదాకా, వీరు ప్రమోట్ చేసిన దానిలో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయి.  అసలు ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు లైసెన్స్ లు ఉన్నాయా వంటి అనేక అంశాలను పోలీస్ లు పరిశీలించవచ్చు

ఒక వేళ ఈ సెలెబ్రిటీలు, ఇన్ ఫ్లుయెన్సర్లు వీళ్ళు బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టకుండా, పెట్టినట్లు ప్రజలను మభ్య పెట్టి ప్రకటనలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చేసినది తప్పే. ఈ ప్రకటనలు చేసినందుకు యాప్ నిర్వాహకులు ఎంత మొత్తం చెల్లించారు అనే విషయాలపై కూడా పోలీస్ లు కూపీ లాగవచ్చు

నటులు కాకుండా ఈ జాబితాలో ఉన్న సెలబ్రిటీ లలో ఎక్కువమంది ఈ టీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ లో కనిపించే వాళ్ళే.  నోటీసు లు రాగానే సే నో తో బెట్టింగ్ అని గబగబా వీడియోలు రిలీజ్ చేశారు టేస్టీ తేజ, రైతు చౌదరి అయిన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే అన్నారు పోలీసులు

రానా, విజయ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా ఈ జాబితా లో ఉండడం దారుణం.