వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్ మోర్ లు సురక్షితం తిరిగి రావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం పై ఎక్స్ లో పోస్ట్ చేశారు
వెల్కమ్ బ్యాక్ సునీత..ఈ భూమి తల్లి మిమ్మల్ని మిస్ అయ్యింది అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
అంతే కాకుండా మీ మొక్కవోని పట్టుదలకు, ధైర్యానికి మీకు పరీక్ష ఎదురైంది. అయిన పట్టుదలతో, పట్టు సడలని ఆత్మ విశ్వాసంతో మీరు ఈ పరీక్షను ఎదుర్కొన్నారు. క్లిష్ట సమయాలలో, సంకల్ప బలం ఎంత గొప్పదో మీరు చూపించారు అంతే కాకుండా ఎంతో మందికి ఆదర్శప్రాయులుగా నిలిచారు
అంతరిక్షం గురించి తెలుసుకోవాలంటే మానవ శక్తి సామర్ధ్యాల పరిమితులను దాటి వెళ్లడం, ధైర్యంగా కలలను కనడం, ఆ కలలను సాధించుకోవడానికి ధైర్యంగా ముందగు వేయడం
సునీత విలియమ్స్ ఒక ఐకాన్ అని, మార్గదర్శకురాలని, తన కెరీర్ ఆసాంతం అసాధారణ స్ఫూర్తిని ప్రదర్శించారు అని ప్రధాన మంత్రి మోడీ సునీత విలియమ్స్ ను కొనియాడారు.
వ్యోమగాములను భూమి మీద కు తీసుకు రావడానికి అహర్నిశలు, అవిశ్రాంతం గా కృషి చేసిన వారిని చూసి గర్వ పడుతున్నానని ప్రధాని అన్నారు
చేసే పని పై కసి, పనిలో ఖచ్చితత్వం తెలిసినా వారికి సాంకేతికత మరియు పట్టుదల కలిస్తే ఏమి జరుగుతుందో వారు చూపించారు అని మోడీ అభినందించారు. గతంలో సునీత విలియమ్స్ తో దిగిన ఫోటో ను ప్రధాని షేర్ చేశారు.

