WPL ఎలిమినేటర్ మ్యాచ్ : ఫైనల్ లో ముంబై ఇండియన్స్

by | Mar 13, 2025 | వార్తలు

WPL ఎలిమినేటర్ మ్యాచ్ : బంతితోనూ రాణించిన మాధ్యుస్ ; ఫైనల్ లో ముంబై ఇండియన్స్

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది

మార్చ్ 15 న, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ లో తలపడతారు.

214 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జెయింట్స్ మొదటి నుండి క్రమం తప్పకుండా వికెట్ లు కోల్పోతూ వచ్చింది

గుజరాత్ జెయింట్స్ ప్లేయర్స్ లో ఓపెనర్ గిబ్సన్ 34 పరుగులు, లిచ్ ఫీల్డ్ 31 పరుగులు, ఫుల్మలీ 30 పరుగులు చేశారు.   వికెట్ల మధ్య సమన్వయ లోపంతో, ముగ్గురు గుజరాత్ జెయింట్స్ ప్లేయర్స్ రన్ అవుట్ అయ్యారు

చివరకు గుజరాత్ జెయింట్స్ 19.2 ఓవర్ల లో 166 పరుగులకు అల్ అవుట్ అయ్యింది

ముంబై ఇండియన్స్ బౌలర్ల లో మాధ్యుస్ మూడు వికెట్లు, కెర్ రెండు వికెట్ లు తీయగా, ఇస్మాయిల్, బృంట్ చెరో ఒక వికెట్ తీశారు

అంతకు ముందు టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్ల లో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది

ఓపెనర్ యాస్తికా భాటియా 15 పరుగులే చేసి అవుట్ అయ్యినా, ఆ తరవాత వచ్చిన నాట్ సీవర్ బృంట్ తో కలిసి మరో ఓపెనర్ మాధ్యుస్ రెండవ వికెట్ కు 133 పరుగులు జోడించారు

50 బంతుల్లో 77 పరుగులు చేసి మాధ్యుస్ అవుట్ అయ్యిన తరవాత కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ వచ్చి రాగానే బాదుడు ఆరంభించింది.  బృంట్, హర్మాన్ లు మూడవ వికెట్ కు ధాటిగా ఆడుతూ 39 పరుగులు జోడించాక, 41 బంతుల్లో 77 పరుగులు చేసిన బృంట్ అవుట్ అయ్యారు

కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ 12 బంతుల్లో 36 పరుగులు చేసి రన్ అవుట్ అయి వెనుతిరిగింది. ఇందులో 4 సిక్సర్ లు , 2 ఫోర్లు ఉన్నాయి

గుజరాత్ గెయింట్స్ బౌలర్ల లో గిబ్సన్ రెండు వికెట్లు తీయగా, గౌతమ్ ఒక వికెట్ తీశారు