WPL : ముంబై ఇండియన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు విజయం
ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ముంబై ఇండియన్స్ పై 11పరుగుల తేడాతో విజయం సాధించింది
ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ కు చేరుకోగా, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ మార్చ్ 13 న ఆడాల్సి ఉంది. మార్చ్ 15 న విమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ జరుగుతుంది
మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్ల లో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది
కెప్టెన్ స్మ్రితి మందన 37 బంతుల్లో 53 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మేఘన 13 బంతుల్లో 26 పరుగులు చేశారు. వన్ డౌన్ లో వచ్చిన పెర్రీ 38 బంతుల్లో 49 పరుగులు(నాట్ అవుట్) , రిచా ఘోష్ 22 బంతుల్లో 36 పరుగులు చేశారు. ఆఖర్లో వారెహామ్ 10 బంతుల్లో 31 పరుగులు చేశారు
ముంబై ఇండియన్స్ బౌలర్ల లో మాధ్యుస్ రెండు వికెట్లు తీసుకోగా, అమేలియా కెర్ ఒక వికెట్ తీసుకున్నారు
అనంతరం 200 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది
ముంబై ఇండియన్స్ ప్లేయర్ లలో నాట్ సీవర్ బృంట్ 35 బంతుల్లో 69 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు, సజన 23 పరుగులు చేశారు
ముంబై ఇండియన్స్ మొదటి నుండి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. మూడవ వికెట్ కు నాట్ సీవర్ బృంట్, కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ లు 40 పరుగులు జోడించారు. నాలుగవ వికెట్ కు నాట్ సీవర్ బృంట్, అమన్ జ్యోత్ కౌర్ 51 పరుగులు జోడించారు. ఈ రెండు వికెట్ కు తప్ప సరైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోయారు. ధాటిగా ఆడే క్రమంలో వికెట్ లు పారేసుకున్నారు
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ల లో స్నేహ రానా 3 వికెట్ లు తీయగా, గార్త్, పెర్రీ లు రెండేసి వికెట్ లు తీశారు. గ్రాహం, వారెహామ్ చెరో ఒక వికెట్ తీశారు.


