ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భాగంగా ఇండియా మాస్టర్స్, వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో ఇండియా మాస్టర్స్ సెమి ఫైనల్ కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. మార్చ్ 13 న సెమి ఫైనల్ జరుగుతుంది. అయితే ఇండియా మాస్టర్స్ తో సెమి ఫైనల్ లో తలపడే జట్టు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది
ఈ మ్యాచ్ లో సచిన్ స్థానంలో యువరాజ్ ఇండియా మాస్టర్స్ కు నాయకత్వం వహించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ జట్టు 20 ఓవర్ల లో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.
ఓపెనర్ సౌరవ్ తివారి 37 బంతుల్లో 60 పరుగులు, అంబటి రాయుడు 35 బంతుల్లో 63 పరుగులు చేశారు. గురు కీరత్ సింగ్ 21 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
కెప్టెన్ యువరాజ్ సింగ్ 20 బంతుల్లో 49 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇండియా మాస్టర్స్ ఇన్నింగ్స్ మొత్తంగా 13 సిక్సర్లు, 26 ఫోర్లు ఉన్నాయి.
వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ జట్టులో టేలర్, బెన్, కార్టర్ లు తలా ఒక వికెట్ తీశారు
ఆ తరవాత 254 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ కూడా ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది.
ఓపెనర్ లు డెవాన్ స్మిత్, పెర్కిన్స్ మొదటి వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డెవాన్ స్మిత్ 34 బంతుల్లో 79 పరుగులు, పెర్కిన్స్ 24 బంతుల్లో 52 పరుగులు చేశారు. ఆ తరవాత వచ్చిన సిమ్మన్స్ ధాటిగా ఆడుతూ 13 బంతుల్లో 38 పరుగులు చేశాడు. లారా ఆఖర్లో వచ్చి ఒక బంతి మాత్రమే ఆడి, ఆ బంతిని బౌండరీకి తరలించాడు
వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ జట్టు 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్షానికి 7 పరుగుల దూరం లో నిలిచిపోయింది. వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ ఇన్నింగ్స్ లో 17 సిక్సర్ లు, 20 ఫోర్లు ఉన్నాయి
ఇండియా మాస్టర్స్ బౌలర్ల లో బిన్నీ 3 వికెట్లు, నేగి 2 వికెట్లు తీసుకోగా, ఇర్ఫాన్ పఠాన్ ఒక వికెట్ తీసుకున్నాడు
50 ఏళ్ళ వయసులోనూ సీనియర్ ఆటగాళ్లు మైదానంలో అదరగొడుతున్నారు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ, మైదానంలో చురుకుగా రన్స్ తీస్తున్నారు

