పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల మ్యాచ్ వరుణ దేవుడికి అంకితం

by | Feb 27, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా, రావల్పిండి లో ఈ రోజు జరగాల్సిన పాకిస్థాన్, బాంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది

ఛాంపియన్స్ ట్రోఫీ కి  వేదికైన పాకిస్థాన్ కనీసం ఒక్క మ్యాచ్ గెలవకుండానే గూటికి చేరుకోవాల్సిన పరిస్థితి.

మొదటి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన పాక్ కు బంగ్లాదేశ్ మీద అయినా గెలిచి పరువు నిలుపుకోవాలనుకున్న పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.  అంపైర్ లు మ్యాచ్ ను రద్దు చేసి చెరో పాయింట్ ఇచ్చారు. కనీసం ఒక పాయింట్ వచ్చింది. మ్యాచ్ ఆడి, ఓడితే పాయింట్ రాదు, పరువు పోతుంది. దాని కన్నా మ్యాచ్ రద్దు అవడమే మంచిది.

ఇంతకు ముం, రావల్పిండిలో, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షార్పణం అయినవిషయం తెలిసిందే

ఆదివారం (మార్చ్ 2) భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ బట్టి పాయింట్ల పట్టికలు ఎవరు అగ్రస్థానాలో ఉంటారు అనేది తేలుతుంది.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో ఒక మ్యాచ్ లో కూడా గెలవకుండా గ్రూప్ ఎ నుండి పాక్, బంగ్లాదేశ్ లు ఇంటి ముఖం పట్టాయి