కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున (Nagarjuna) ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర'(Kubera).ఈ మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మీక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి , అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్టర్ చేయడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం, ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడంతో కుబేరపై అందరిలోనూ ఆసక్తి నేలకొంది.
ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రల్లో నటించనుండగా.. నాగార్జున పారిశ్రామికవేత్తగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకి చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. పాన్ ఇండియా స్థాయిలో కుబేర చిత్రం ఈ జూన్ 20న విడుదల కానున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో రిలీజ్ డేట్ రివీల్ చేశారు. కాగా, ‘కుబేర మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. నికేత్ బొమ్మి కెమెరా మెన్ గా వ్యవహరిస్తున్నారు

