ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా, యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది
గ్రేస్ హారిస్ 26 బంతుల్లో 45 పరుగులు, దినేష్ వృందా 33 పరుగులు, సెహ్రావాత్ 19 పరుగులు, ఛెత్రి 13 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్స్ ఎవరు రెండంకెల స్కోర్ చేయలేదు
ముంబై ఇండియన్స్ బౌలర్లలో నాట్ సీవర్ బృంట్ 3 వికెట్లు తీయగా, ఇస్మాయిల్, గుప్తా రెండేసి వికెట్లు తీశారు. మాధ్యుస్, కేర్ చెరో ఒక వికెట్ తీశారు
143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కు ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ యాస్తికా భాటియా డక్ అవుట్ అయి వెను తిరిగింది
అయితే నాట్ సీవర్ బృంట్, హేలీ మాధ్యుస్ రెండవ వికెట్ కు 133 పరుగులు జోడించారు. హేలీ మాధ్యుస్ 59 పరుగులు చేసి జట్టు స్కోర్ 139 పరుగులు ఉన్నప్పుడు అవుట్ అయ్యింది
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్,, నాట్ సీవర్ బృంట్ తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు. నాట్ సీవర్ బృంట్ 44 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
75 పరుగులు చేయడమే కాకుండా, 3 వికెట్ లు తీసిన నాట్ సీవర్ బృంట్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది
ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించగా, ముంబై ఇండియన్స్ యూపీ వారియర్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది

