ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లో భాగంగా ఈ రోజు భారత(INDIA), బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. 49.4 ఓవర్ లలో బంగ్లాదేశ్ 228 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండు పరుగులకే రెండు వికెట్ లు కోల్పోయింది. కీలక బంగ్లా ఆటగాళ్లు కెప్టెన్ శాంతో, సౌమ్య సర్కార్ లు డక్ అవుట్ అయ్యారు.
తాంజిద్ హాసన్ కొంత ప్రతిఘటించినా 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మెహదీ హాసన్ మిరాజ్ 5 పరుగులు, సీనియర్ బ్యాట్స్ మన్ ముషఫికర్ రెహ్మాన్ డక్ అవుట్ అవడంతో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది
అయితే ఆ తరవాత వచ్చిన జేకర్ అలీ, తౌహిర్ హ్రిదయ్ ఆరవ వికెట్ కు 154 పరుగులు జోడించారు. 68 పరుగులు చేసిన జేకర్ అలీ, షమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
అయితే తౌహిర్ హ్రిదయ్ మాత్రం, పోరాట పటిమను ప్రదర్శించి 118 బంతుల్లో సరిగా 100 పరుగులు చేసి ఆఖరి బ్యాట్స్ మన్ గా హర్షిత్ రానా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆఖరులో తౌహిర్ హ్రిదయ్ కాలి కండరాలు పట్టేసి చాలా ఇబ్బందిపడ్డాడు
అక్షర్ పటేల్ తాంజిద్ హాసన్, ముషఫికర్ రెహ్మాన్ లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. అక్షర్ పటేల్ (Akshar Patel) కు హ్యాట్రిక్ తీసే అవకాశం వచ్చింది. అయితే బంగ్లా బాట్స్ మన్ జేకర్ ఇచ్చిన క్యాచ్ ను, కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయడంతో ఆ అవకాశం తప్పిపోయింది. రోహిత్ శర్మ కూడా చేతితో గ్రౌండ్ ని కొడుతూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అక్షర్ పటేల్ కు అపాలజీ చెప్పిన రోహిత్ శర్మ
భారత బౌలర్ల లో షమీ (Shami) 5 వికెట్ లు తీయగా, హర్షిత్ రానా (Harshit Rana) మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు


