హైదరాబాద్ వేదికగా ప్రపంచ సుందరి పోటీలు ; టైటిల్ గెలిచిన భారతీయులు ఎవరు?
ప్రపంచ సుందరి పోటీలు మన హైదరాబాద్ లో జరుగబోతున్నాయి. ఇది హైదరాబాద్ కు ఒక గర్వ కారణం. గతంలో 1996 లో బెంగుళూరు లో, 2024 లో ముంబై లో ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. 72 వ ప్రపంచ సుందరి పోటీలు మన హైదరాబాద్ లో జరుగనున్నాయి. అంటే ఇండియా లో ఇది మూడవసారి.
ఈ ప్రపంచ సుందరి పోటీలలో 130 నుండి 140 దేశాల చెందిన యువతులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ పోటీలు మే 4 నుండి 31 వరకు జరుగుతాయి.
మిస్ వరల్డ్ పోటీలో ఒక రోజులో అయిపోయే ఈవెంట్ కాదు. దీనిని 7-8 సార్లుగా ఈ పోటీలని నిర్వహించాలి. మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించే సంస్థ లండన్ లో ఉంది. ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలు మాత్రం హైదరాబాద్ లోనే జరుగుతాయి
మిగిలిన ఈవెంట్ లు రామప్ప, యాదాద్రి ఆలయాలు, లక్నవరం,అనంత గిరి వంటివి ఈ జాబితాలో ఉన్నయ్యని సమాచారం. హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియం లను కూడా ప్రతిపాదించారు
ఈ నెల 27 న పత్రిక విలేఖరుల సమావేశంలో పూర్తి వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖతో, ప్రపంచ సుందరి పోటీల నిర్వాహకులు కలిసి ప్రకటిస్తారు
టైటిల్ గెలిచిన భారతీయులు ఆరుగురు
ఇప్పటి వరకు ప్రపంచ సుందరి టైటిల్ ను గెలుచుకున్న భారతీయులు ఎవరో తెలుసా
1966 లో రీటా ఫారియా మొదటి సారిగా ప్రపంచ సుందరి టైటిల్ ను గెలుచుకున్నారు. రీటా ఫారియా ఫిజిషియన్, మోడల్.
ఆ తర్వాత 30 సంవత్సరాలకు మల్లి ఐశ్వర్య రాయ్ ఈ టైటిల్ ను గెలుచుకున్నారు. అక్కడనుండి ప్రపంచ సుందరి టైటిల్ గెలవడం కొంత పరిపాటి అయ్యింది. 1997 లో డయానా హైడెన్, 1999 లో యుక్త ముఖి, 2000 లో ప్రియాంక చోప్రా, 2017 లో మానుషి చిల్లర్ గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు భారతీయులు ఈ ప్రపంచ సుందరి టైటిల్ ను గెలుచుకున్నారు.
ఈ టైటిల్ తో వచ్చిన క్రేజ్ ను మాత్రం ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా మాత్రమే ఉపయోగించుకోగలిగారు
మన దేశం లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల గురించి
మన దేశం లో మొదటి సారి ప్రపంచ సుందరి పోటీలు బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియం లో జరిగాయి. 88 దేశాల వారు ఈ పోటీలో పాల్గొన్నారు. గ్రీకు దేశానికి చెందిన Irene Skliva మిస్ వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
1996 ప్రపంచ సుందరి పోటీలకు ఐశ్వర్య రాయ్ ఒక జడ్జి గా వ్యవహరించారు. అంతే కాకుండా బాలీవుడ్ అమిర్ ఖాన్, క్రికెటర్ సనత్ జయ సూర్య కూడా జడ్జిలుగా వ్యవహరించారు. 1996 లో ఈ ఈవెంట్ ను అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహించారు. కల్చర్ పరంగా, స్థానిక ప్రజల నుండి కొంత ప్రతిఘటన ఎదురైనా, ప్రభుత్వ సహకారముతో బాగానే నిర్వహించారు.
2024 లో జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ప్రపంచ సుందరి పోటీలలో చెక్ రిపబ్లిక్ కు చెందిన Krystyna Pyszková టైటిల్ ను గెలుచుకుంది

