ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. ‘డ్రాగన్’ మొదలైందిగా.!

by | Feb 20, 2025 | సినిమా

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (NTR) ప్ర‌స్తుతం ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. గతేడాది దేవ‌ర (Devara)మూవీతో ఎన్టీఆర్ సూపర్ హిట్ అందుకున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ సినిమ తరువాత క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయ‌బోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్‌ పెట్టనున్నారని టాక్ వినిపించింది. ఇప్ప‌టికే పూజ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమా షూటింగ్‌కి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ను మేకర్స్ అందించారు.

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టినట్లు ప్రకటించింది. భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పేందుకు సమయం వచ్చింది. ఎన్టీఆర్‌-(NTR) ప్రశాంత్ నీల్‌ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ను సరికొత్తగా చూపించబోతున్నాం అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేశారు.