టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో బాలయ్య పోషిస్తున్న అఘోర పాత్రపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అఖండ 2 సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు హైలైట్ గా నిలువనున్నాయని అంటున్నారు. అలాగే అఘోరా పాత్రలో బాలయ్య నటన చూసి సెట్స్ లో ఉన్న వాళ్ళు కూడా షాక్ అవుతున్నారంట.
కాగా, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పర్వదినం కానుకగా అఖండ 2 లో బాలయ్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తో పాటుగా యంగ్ హీరో, విలక్షణ యాక్టర్ ఆది పినిశెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించనునన్నట్లు తెలుస్తోంది.

