4వ టెస్ట్ లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం

by | Dec 30, 2024 | వార్తలు

గవాస్కర్ బోర్డర్ ట్రోఫీ – నాలుగవ టెస్ట్ లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం

భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్టులో 340 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 155 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.

33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్ఠాలలో పడిన భారత జట్టును, జైస్వాల్, రిషబ్ పంత్ నాలుగవ వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు.  అయితే, రిషబ్ పంత్ అవుట్ అయిన వెంటనే, జడేజా, నితీష్ కుమార్ రెడ్డి లు వెంట వెంటనే అవుట్ అయ్యారు.  జైస్వాల్ 84 పరుగులు చేసి వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు.

ఆస్ట్రేలియా బౌలర్ల లో కమ్మిన్స్, బొలాండ్ చెరో మూడు వికెట్లు తీయగా, లియాన్ రెండు వికెట్లు,  స్టార్క్, హెడ్ తలా ఒక వికెట్ తీశారు

ఈ మ్యాచ్ ఓటమికి ఆస్ట్రేలియా జట్టు రెండవ ఇన్నింగ్స్ లో లియాన్ చేసిన 41 పరుగులు,  స్కాట్ బొలాండ్ చేసిన 15 పరుగులు కీలకంగా మారాయి.  173 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును లియాన్, బొలాండ్ లు 10 వ వికెట్ కు 61 పరుగులు చేసి ఆదుకున్నారు

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ – 474

స్టీవ్ స్మిత్ 140 | బుమ్రా 4 వికెట్లు

ఇండియా మొదటి ఇన్నింగ్స్ 369

నితీష్ కుమార్ రెడ్డి 114 | బొలాండ్ 3 వికెట్లు

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ – 234

లియాన్ 41 |  బుమ్రా 5 వికెట్లు

ఇండియా రెండవ ఇన్నింగ్స్ – 155

జైస్వాల్ 84 | బోలను 3 వికెట్లు

ఆస్ట్రేలియా సిరీస్ లో 2-1 తో ఆధిక్యంలో ఉంది. గవాస్కర్ బోర్డర్ ట్రోఫీ లో చివరి టెస్ట్ సిడ్నీ లో జనవరి మూడున ప్రారంభమవుతుంది