భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో సీనియర్లు అందరు విఫలమైన చోట, మన తెలుగు వాడు, విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎనిమిదవ స్థానంలో వచ్చి సెంచరీ చేసి భారత జట్టు ఫాలో ఆన్ కాకుండా గట్టెంఇక్చాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నితీష్ కుమార్ రెడ్డి ని ట్విట్టర్ సాక్షిగా అభినందించారు
21 ఏళ్ళ నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. భారత జట్టుకు భావి భారత ఆశా కిరణంగా నితీష్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నాడు. అద్భుతమైన షాట్ సెలక్షన్, సూపర్ గుడ్ ఫుట్ వర్క్ తో చూడముచ్చటైన షాట్లతో ఆడిన నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ ఆసాంతం అలరించింది అని చెప్పవచ్చు
ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి, ఆస్ట్రేలియా లో సెంచరీ చేసిన మూడవ యంగెస్ట్ క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ తర్వాత స్థానం నితీష్ కుమార్ రెడ్డి
సిరీస్ ఆసాంతం అద్భుతం గా ఆడుతూ ఈ రోజు తన తొలి సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు

