తెలుగు సినీ ప్రముఖులంతా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. నిర్మాత, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రారంభానికి ముందు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను, సినీ ప్రముఖులకు సీఎం ప్రదర్శించారు.
అయితే 46 మంది సినీ ప్రముఖులు కలిశారు. అందులో ఈ తరం కథానాయకులలో ప్రముఖులైన ప్రభాస్, మహేష్ బాబు, తారక్, రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ తదితరులు ఈ మీటింగ్ కి హాజరు అవలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి వీలుపడకపోవచ్చు. మా ప్రెసిడెంట్ విష్ణు మరియు నటుడు రాజ శేఖర్ హాజరవలేదు. అసలు, దిల్ రాజు పిలిచారా, లేదా.
తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది సినీ ఇండస్ట్రీ కి అంతే కాకుండా కొన్ని విషయాలను తేల్చి చెప్పింది.
- అభిమానులను కంట్రోల్ చేసుకోవలసిన బాధ్యత సెలెబ్రిటీలదే
- మాదకద్రవ్యాలపై నియంత్రణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, మహిళల భద్రతకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల మీద సెలెబ్రిటీలు చొరవ చూపించాలి
- బౌన్సర్ల విషయంలో గట్టిగా, సీరియస్ గా ఉంటాం.
- దేవాలయాల టూరిజం, ఎకో టూరిజం ను కూడా సెలెబ్రిటీలు ప్రచారం చేయాలి
- తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సినీ ప్రముఖులు కూడా భాగస్వాములు కావాలి, తనవంతు బాధ్యత తీసుకోవాలి
- బెనిఫిట్ షోస్ వలన వచ్చే డబ్బు ప్రజా సేవకు ఉపయోగపడాలి అన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చొరవ తీసుకుని సినీ పరిశ్రమకు గద్దర్ అవార్డులను తీసుకు వచ్చారు. అంతే కాకుండా ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉండడానికి ఎఫ్ డి సి చైర్మన్ గా దిల్ రాజును నియమించారు.
సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని సినీప్రముఖులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు
అయితే, ఎవరో ఒకరు నా పేరు మర్చిపోతే, నేను ఎందుకు కక్ష కడతాను. ఈ రూమర్ల మీద సినీ ప్రముఖులు ఎవరు స్పందించకపోవడం పట్ల సీఎం కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
అయితే, సంక్రాంతి కి మూడు పెద్ద చిత్రాల విడుదల నేపథ్యంలో, బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ మీద, టికెట్ రేట్స్ పెంపు మీద మరికొంత క్లారిటీ రావలసి ఉంది.

