తీవ్ర అనారోగ్యంతో, ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న 92 ఏళ్ళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే హుటాహుటిన బెళగావి నుండి ఢిల్లీ బయలు దేరారు. సోనియా గాంధీ కూడా మన్మోహన్ సింగ్ ను చూడడానికి వెళుతున్నారు. ప్రియాంక గాంధీ ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారని సమాచారం.
ప్రధాన మంత్రి మోడీ ఫోన్లో మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో మాడ్లాడినట్లు తెలుస్తోంది
2004 నుండి 2014 వరకు UPA గవర్నమెంట్ లో ప్రధాన మంత్రి గా పని చేశారు. పి వి నరసింహారావు, మన్మోహన్ సింగ్ సంస్కరణలు రూపొందించడంలో భారత దేశంలో అగ్రగణ్యులు అని చెప్పవచ్చు

