రేవతి కుటుంబానికి, రెండు కోట్ల ఆర్ధిక సాయం (పరిహారం) చెక్కు ద్వారా FDC చైర్మన్ దిల్ రాజు కు అందచేశారు అల్లు అరవింద్.
దిల్ రాజు, అల్లు అరవింద్ కిమ్ ఆస్పత్రి కి వెళ్లి శ్రీ తేజ్ ని చూసి వచ్చారు. వెంటిలేటర్ లేకుండా శ్రీ తేజ్ 72 గంటలు ఉన్నాడని దిల్ రాజు చెప్పారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. ఇండస్ట్రీ అంత ఊపిరి పీల్చుకునే వార్త ఇది.
అల్లు అర్జున్ ఒక కోటి (మొదట 25 లక్షలు ప్రకటించిన పుష్ప), మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పాయింట్మెంట్ దొరికిందని దిల్ రాజు చెప్పారు. రేపు ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్సుతున్నారు.
చైర్మన్ పదవి చేపట్టగానే, దిల్ రాజు భుజాల మీద అతి పెద్ద బాధ్యత పడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏమి లేదని చెప్పడానికి, సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ మీటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
రేపు ఉదయం 10 గంటలకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు

