వర్షం వలన అవాంతరాలతో మొదలైన భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ ను అంపైర్లు డ్రా గా ప్రకటించారు.
ఆట ఆఖరి రోజున ఆకాష్ దీప్ 31 పరుగుల వద్ద హెడ్ బౌలింగ్ స్టంప్ అవుట్ అవడంతో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ 260 పరుగుల వద్ద ముగిసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. చివరకు ఏడు వికెట్ల నష్టానికి 89 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్, ఆకాష్ దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు
274 పరుగుల లక్షాన్ని ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టు టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. అయితే వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్ ను అంపైర్లు డ్రాగా ప్రకటించారు.
ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ 445
హెడ్ : 152 | స్మిత్ : 101 | Alex Carey 70 | బుమ్రా 6 వికెట్లు | సిరాజ్ 2 వికెట్లు
భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ 260
రాహుల్ : 84 | జడేజా : 77 | కమిన్స్ 4 వికెట్లు | స్టార్క్ 3 వికెట్లు
ఆస్ట్రేలియా జట్టు రెండవ ఇన్నింగ్స్ : 89/7 డిక్లేర్డ్
కమిన్స్ : 22 | Alex Carey : 20 | బుమ్రా – 3 వికెట్లు, సిరాజ్ -2, ఆకాశ దీప్ రెండు వికెట్లు
భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ : 8/0
మాన్ అఫ్ ది మ్యాచ్ : ట్రావిస్ హెడ్ : 152 | 1/3
భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగవ టెస్ట్ మ్యాచ్ బాక్సింగ్ డే రోజు అనగా డిసెంబర్ 26 న మెల్బోర్న్ లో మొదలవుతుంది

