పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ ని డామేజ్ చేసిందా

by | Dec 14, 2024 | సినిమా

అల్లు అర్జున్ అరెస్ట్ దేనికి సంకేతం ; పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ ని డామేజ్ చేసిందా

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవడం, మధ్యంతర బెయిల్ మీద విడుదల అవడం అంతా 24 గంటల లోపు జరిగిపోయింది.

హై కోర్ట్ మంధ్యంతర బెయిల్ మంజూరు చేసిన, అనేక సాంకేతిక కారణాల వలన అల్లు అర్జున్ జైలులో ఒక సాధారణ ఖైదీలా ఒక రాత్రి మొత్తం మంజీరా బ్యారక్ లో గడపాల్సి వచ్చింది. 

సుమారుగా జైలు లో 12 గంటలు ఉన్నాడు.  ఒక నెంబర్, బ్యారక్ కేటాయించారు. అంటే పోలీస్ రికార్డుల ప్రకారం అల్లు అర్జున్ ఒక ఖైదీ ముద్ర వేసుకున్నాడు

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వచ్చి సినిమా చూసి వెళ్లి ఉంటె ఏ గొడవ ఉండేది కాదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గారు చెప్పారు.  అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా ఒక ర్యాలీల రావడం వలెనే తొక్కిసలాట జరగడం, ఈ తొక్కిసలాటలో ఒక మహిళా చనిపోవడం, ఒక బాలుడు ఆసుపత్రిలో బతకడానికి పోరాడే పరిస్థితి వచ్చింది అని ముఖ్యమంత్రి అన్నారు.

అల్లు అర్జున్ కి పుష్ప స్టార్ హీరో స్టేటస్ తెచ్చి పెట్టింది.    ఇప్పటి దాక మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేయడం తప్ప తెలియని అల్లు అర్జున్  ఫ్యాన్స్ మధ్య పుష్ప విజయాన్నిఎంజాయ్ చేద్దామని వచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి ఒక మహిళా మరణానికి దారి తీసింది.

అయితే ఇక్కడ ముఖ్యమంత్రి లేవదీసిన లాజిక్ ప్రకారం అందరు అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అడుగుతున్నారు కానీ మరణించిన మహిళ రేవతి గురించి కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు, వారి భవిషత్తు గురించి ఎవరు అడగడంలేదని అన్నారు.  ఇక్కడ ఇది కూడా ఆలోచించ దగ్గ విషయమే. 

ఇటీవల అభిమానుల నుండి విపరీతమైన స్పందన రావడం వలన, Jr NTR దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు.

ఈ మొత్తం సంఘటనలో ఎవరి పాత్ర ఎంత ఉందొ చూద్దాం

సినిమా మీద అభిమానం ఉండచ్చు,  సినిమా నటుల మీద అభిమానం ఉండచ్చు, కానీ మన కుటుంబాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే.  తన కొడుకు అడిగాడని ఫ్యామిలీ తో చలికాలంలో రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షో కి తీసుకు వచ్చిన రేవతి భర్త, తన పిల్లవానికి ఒకటి రెండు రోజుల తరవాత Pushpa సినిమాకి వెళదామని సర్దిచెప్పుకోలేకపోయాడా. 

సంధ్య థియేటర్ దగ్గర స్టార్ హీరో ల సినిమాలు వస్తే కోలాహలం ఎక్కువ గానే ఉంటుంది. కొత్త సినిమాలు వచ్చినప్పుడు, థియేటర్ యాజమాన్యం పోలీసుల సహాయాన్ని కోరడం సహజం.  ఇది సహజం గా జరిగే ప్రక్రియ.   సినిమా హీరో, హీరోయిన్ లు ప్రీమియర్ షో లకు వెళ్లడం కూడా మామూలే.

అయితే పుష్ప పార్ట్ 1 తో బాగా హైప్ వచ్చిన పుష్ప 2 కి అల్లు అర్జున్ థియేటర్ బ్యాక్ డోర్ నుండి వెళ్లి చూసి రావలసింది (గతంలో ఇలానే చేసేవారు)

కానీ జనం మధ్యలో చూద్దామని, పోలీస్ పర్మిషన్ వచ్చిందో, రాలేదో తెలుసుకోకుండా ఒక ర్యాలిలా అల్లు అర్జున్ రావడం వలన ఇక్కడ తొక్కిసలాట జరిగింది.  బౌన్సర్లు అల్లు అర్జున్ ను ప్రొటెక్ట్ చేసే పనిలో వారికీ తెలియకుండానే సామాన్య ప్రేక్షకులను ఇబ్బంది పెట్టచ్చు

ఇక్కడ పోలీసులను నిందించలేము.  ఒకొక్కసారి ప్రేక్షకులను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు.  ఇటువంటి పరిస్థితులలో నటీనటులు, ముఖ్యంగా స్టార్ హీరోలు పబ్లిక్ లోకిం వచేటపుడు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకోవాలి. ప్రతిదానికి ప్రతిపక్షం లాగా ప్రభుత్వాన్ని, పోలీసులను నిందించలేము.  సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ విషయాన్నీ మరచిపోకూడదు. 

ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి

కామన్ మాన్ ప్రొటెక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, అదే విధంగా   చట్టానికి ఎవరు అతీతులు కాదు అనే మెసేజ్ ప్రభుత్వం పంపింది.

పుష్ప-2 సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని ఒక రకం గా డామేజ్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే సినీమా చూసిన వాళ్ళందరూ పుష్ప-1 బావుందని అన్నారు (సగటు అల్లు అర్జున్ అభిమానితో సహా)

సినిమా టికెట్స్ రేట్లు పెంచకపోతే, ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ రికార్డులు ఉండవు, కంటెంట్ తో కంటే, టికెట్ రేట్లు పెంచడం వలన ఈ కలెక్షన్స్ వస్తున్నాయనే విషయం అందరికి తెలిసిందే. 

ఒక స్మగ్లర్ ని హీరో గా చూపించడం అనే పాయింట్ కొన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించలేదు.  బాహుబలి లాగ యూనివర్సల్ సబ్జెక్టు తో వచ్చి ఉంటె అల్లు అర్జున్, సుకుమార్ ఇమేజ్ వేరే లెవెల్ కి వెళ్ళేది

ఆ తరవాత సంధ్య థియేటర్ ఘటనలో ఒక మహిళా చనిపోవడం, అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, 12 గంటలు సాధారణ ఖైదీలుగా గడపడం ఎప్పటికీ అల్లు అర్జున్ జీవితంలో మరచిపోలేని సంఘటనలు

రేవంత్ రెడ్డి నేషనల్ మీడియా సాక్షిగా ఈ విషయం గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ ఇమేజ్ డామేజ్ అయ్యేలా మాట్లాడడం వంటి విషయాలతో అల్లు అర్జున్ ఇమేజ్ దెబ్బతింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.  స్వతహాగా దూకుడైన స్వభావం కూడా అల్లు అర్జున్ కి సోషల్ మీడియా లో చెడ్డ పేరు తీసుకు వస్తోంది

అల్లు అర్జున్ అరెస్ట్ మీద, నాని, రష్మిక, వరుణ్ ధావన్, బ్రహ్మాజీ ఇలా కొంతమంది మాత్రమే స్పందించారు.  స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతల నుంచి సోషల్ మీడియా వేదిక మీద ఎటువంటి మద్దతు లభించలేదు.  ఎందుకంటే లీగల్ వ్యవహారాల మీద ఆచి, తూచి స్పందించాలన్న ఉద్దేశం కావచ్చు.  అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ను నిందించడానికి అల్లు అర్జున్ ఇష్యూని బాగా వాడుకున్నారు.

ఈ మొత్తం వ్యవహారం నుండి  ఇటు థియేటర్ వారు, స్టార్ హీరోలు సారాంశం గ్రహించి నడుచుకుంటే ఏ సమస్య ఉండదు.