పాకిస్థాన్ ఓపెనర్ల విధ్వంసం ; శ్రీలంక ముందు భారీ లక్ష్యం

by | Feb 28, 2026 | క్రీడలు

T20 World Cup – Super 8 : పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.

పాకిస్థాన్ ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 176 పరుగులు జోడించారు. T20 World Cup లో ఏ వికెట్ కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం

ఫకర్ జమాన్ 42 బంతుల్లో 84 పరుగులు (4×6, 9×4)  చేసి అవుట్ అయ్యాక పాకిస్థాన్ వెంట వెంటనే వికెట్లు కోల్పోతూ వచ్చింది.  కాసేపటికి సెంచరీ హీరో షాహిబ్జాదా ఫర్హాన్ 60 బంతుల్లో సరిగా 100 పరుగులు (5×6, 9×4) చేసి అవుట్ అయ్యాడు.  మొహమ్మద్ నవాజ్, కెప్టెన్ సల్మాన్ ఆఘా లు డక్ అవుట్ అయ్యారు.  పాకిస్థాన్ 36 పరుగుల తేడాలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది

శ్రీలంక బౌలర్లలో  మధుశంక మూడు వికెట్లు , శనక రెండు వికెట్లు తీసుకోగా, చమీర, కు ఒక వికెట్ దక్కింది

పాకిస్థాన్ సెమి ఫైనల్ చేరాలంటే శ్రీలంక ను 147 పరుగులు లేదా అంత కన్నా తక్కువకు కట్టడి చేయాలి లేదంటే న్యూజిలాండ్ సెమి ఫైనల్ కు చేరుకుంటుంది