T20 World Cup : భారత జట్టు విజయ లక్ష్యం 188 పరుగులు

by | Feb 22, 2026 | క్రీడలు

T20 World Cup : సౌత్ ఆఫ్రికా తో Super 8 మ్యాచ్ :  భారత జట్టు విజయ లక్ష్యం 188 పరుగులు

India Vs South Africa : భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.   మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

భారత పేసర్ల ధాటికి సౌత్ ఆఫ్రికా 20 పరుగులకే మూడు కీలక వికెట్ కు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది.

డికాక్ 6 పరుగులు, మార్కరం 4 పరుగులు, రికెల్టన్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తరవాత వచ్చిన బ్రెవిస్, మిల్లర్ లు ఆచి తూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ లు బాదుతూ స్కోర్ బోర్డు ను కదిలించారు.  వీరిద్దరూ, నాలుగవ వికెట్ కు 97 పరుగులు జోడించారు.

బ్రెవిస్ 29 బంతుల్లో 45 పరుగులు ( మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) చేసి అవుట్ అయ్యాడు.  ఆ తరవాత వచ్చిన స్టబ్స్ తో కలిసి మిల్లర్ 35 పరుగులు జోడించాక, 35 బంతుల్లో 63 పరుగులు ( 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసిన మిల్లర్ అవుట్ అయ్యాడు.

మిల్లర్ అవుట్ అయ్యాక స్టబ్స్ ఒంటరి పోరాటం చేసి 24 బంతుల్లో 44 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. హార్దిక పాండ్య వేసిన ఆఖరి ఓవర్లో స్టబ్స్ 20 పరుగులు రాబట్టాడు

భారత బౌలర్లలో బుమ్రా (Bumra) పొదుపుగా బౌలింగ్ చేసి, నాలుగు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి, మూడు  కీలక వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్ కూడా రెండు వికెట్లు తీసుకోగా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే లు ధారాళంగా పరుగులు ఇచ్చి చెరో ఒక వికెట్ తీసుకున్నారు