తమిళ అగ్ర కథానాయకులు సుపర్ స్టార్ రజనీకాంత్ (Rajani Kanth) , యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Hasan) దక్షిణాది ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న స్టార్ హీరోలు. వీరి సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. రజినీకాంత్, కమల్ హాసన్ వీరిద్దరిలో ఏ ఒక్కరి సినిమా విడుదలైనా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈ కథానాయకులు ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ (Kamal Hasan) నిర్మాణ సారథ్యంలోనే రానున్న ఈ సినిమా గురించి యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
తాజాగా సమాచారం ప్రకారం, ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ నెల్సన్ ఇప్పటికే రజినీకాంత్ (Rajani Kanth) , కమల్ హాసన్ కాంబోపై అదిరిపోయే అనౌన్స్మెంట్ వీడియో సిద్ధం చేశారని సమాచారం. త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం మాత్రం కాస్త ఆలస్యంగా అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ ‘జైలర్ 2’తో సినిమాతో పాటుగా తెలుగులోనూ మరో సినిమాను చేయాలని చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ముగిశాకే రజినీకాంత్, కమల్ హాసన్ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద చాలా రోజుల తర్వాత అప్ డేట్ రావడంతో అటు రజినీ అభిమానులు ఇటు కమల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

