మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, లేడీ సుపర్ స్టార్ నయనతార (Nayanathara) కథానాయికగా, విక్టరీ వెంకటేష్ (Venkatesh) కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో పాటుగా థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సుమారు రూ.400 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించి టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సాధించింది.
ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రం అదరగొట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ జోరు నడుస్తున్న కారణంగా థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్న వారు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఇలాంటి తరుణంలో కూడా కేవలం తెలంగాణలోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రాన్ని ఏకంగా 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ధియేటర్లలో వీక్షించినట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇటీవలి కాలంలో సినిమా వసూళ్ల వివరాలే తప్పులుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఏకంగా వీక్షకుల లెక్కలు కూడా చెప్పి ‘మన శంకర వరప్రసాద్ గారు’ కు పోటీనే లేదని నిర్మాతలు వెల్లడించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన సంగతి తెలిసిందే.


