భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగవ టి 20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్ లో న్యూజిలాండ్ కు ఇదే తొలి విజయం.
216 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు క్రమం తప్పకుండ వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సంజు శాంసన్, రింకు సింగ్ లు మూడవ వికెట్ కు 46 పరుగులు జోడించారు. సంజు శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన పాండ్య రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
కాసేపటికే 30 బంతుల్లో 39 పరుగులు చేసిన రింకు సింగ్ కూడా అవుట్ అయ్యాడు. 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడిన భారత జట్టును శివ దూబే ఒంటి చేత్తో ఆదుకున్నాడు.
శివమ్ దూబే సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇష్ సోది వేసిన ఇన్నింగ్స్ పన్నెండవ ఓవర్ లో 29 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ లో శివమ్ దూబే మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తరవాత డఫీ ఓవర్ లో దూబే మరో రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో దూబే 15 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, రెండు ఫోన్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హర్షిత్ రానా, శివమ్ దూబే లు ఆరవ వికెట్ కు 63 పరుగులు జోడించారు.
అయితే దురదృష్ట వశాత్తు హర్షిత్ రానా కొట్టిన బంతి బౌలర్ చేతికి తగిలి వికెట్లకు తగలడంతో క్రీజ్ బయట ఉన్న దూబే రన్ అవుట్ రూపంలో అవుట్ అయ్యాడు. శివమ్ దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేశాడు.
శివమ్ దూబే అవుట్ అయిన తరవాత మరో 20 పరుగులు జోడించి భారత జట్టు మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. శివమ్ దూబే రన్ అవుట్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. చివరకు భారత జట్టు 18.4 ఓవర్ల లో 165 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ సాంట్నర్ మూడు వికెట్లు తీయగా, ఇష్ సోది, డఫీ చెరో రెండు వికెట్లు తీశారు. హెన్రీ, డఫీ, ఫోల్క్స్ లు తలా ఒక వికెట్ తీశారు
అంతకు ముందు టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్ లు మొదటి వికెట్ కు 100 పరుగులు జోడించి చక్కని శుభారంభాన్ని ఇచ్చారు. కాన్వే 23 బంతుల్లో 44 పరుగులు, సీఫెర్ట్ 36 బంతుల్లో 62 పరుగులు చేశారు. వన్ డౌన్ లో వచ్చిన రచిన్ రవీంద్ర రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఫిలిప్స్ 16 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఆపద్బాంధవుడు డరిల్ మిచెల్ 18 బంతుల్లో 39 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. చివరి వరుస ఆటగాళ్లు సాంట్నర్, ఫోల్క్స్, హెన్రీ లు ముగ్గురు కలిసి 15 బంతులు ఆడి 30 పరుగులు చేశారు
భారత జట్టు బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఆర్షదీప్ సింగ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. బిష్ణోయ్, బుమ్రా లు చెరో ఒక వికెట్ తీశారు

