అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanaka Raj) దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే చిత్రం ఓ సూపర్ హీరో మూవీలా రూపొందనుందని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి దర్శకుడు లోకేశ్ పై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమాకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేసరికి ‘ఖైదీ 2’ (Khaidi 2) పక్కనపెట్టేశాడు అందువల్లే
(ఎల్సీయూ) లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ ఆగిపోయింది అని రకరకాల వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా వీటిపై లోకేశ్ కనకరాజ్ స్వయంగా స్పందించాడు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..’గత కొన్ని రోజులుగా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ ముగిసిపోయిందని అంటున్నారు. ‘ఖైదీ 2’ కూడా ఆగిపోయిందంటున్నారు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అల్లు అర్జున్ తో చేస్తున్న ‘AA23’ మూవీ తర్వాత ఖైదీ 2 సినిమానే మొదలెడతాం. అయితే కమల్ హాసన్, రజినీకాంత్‌తో ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన అవి సాధ్యం కాలేదు. ‘ఖైదీ 2’ ప్రారంభించే సమయంలోనే హీరో కార్తీ వేరే సినిమాకు డేట్స్ ఇవ్వడంతో ఇదీ సాధ్యం కాలేదు. అల్లు అర్జున్‌తో చేస్తున్న మూవీ పూర్తవగానే ‘ఖైదీ 2′ చేస్తాను’ అని లోకేశ్ స్పష్టం చేశారు. ఇక లోకేశ్ కనగరాజ్ చెప్పిన దాని ప్రకారం అన్నీ సక్రమంగా జరిగితే ఖైదీ 2 సినిమా 2027లో సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. కాగా, కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఖైదీ’ మూవీ 2019లో విడుదలవగా బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. యాక్షన్ థ్రిల్లింగ్ కథాంశంతో అద్బుతంగా తెరకెక్కించాడు లోకేశ్. ఈ క్రమంలోనే ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్.

