పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఆయన నటించిన ‘ది రాజా సాబ్’ మూవీ థియేటర్లలో సందడి చేస్తుండగానే.. ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేశాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fouji) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) కూడా తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. వీటికి పాటుగా ‘సలార్-2’ (Salaar 2) , ‘కల్కి-2′(Kalki 2) కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రభాస్ (Prabhas) స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు. ముందు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఆ తర్వాత డేట్స్ కేటాయిస్తున్నాడు. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ (Allu Arjun) ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ (Sun Pictures) సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. దింతో పాటుగా బన్నీ కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది.
ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే సందీప్ రెడ్డి వంగతో అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా చేయనున్నాడని టీ-సిరీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ప్రభాస్ (Prabhas), సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమాను నిర్మిస్తోన్న టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా ముగియగానే యానిమల్ పార్క్ సినిమా మొదలేడతామని, ఆపై సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) – అల్లు అర్జున్ కాంబోలో సినిమా చేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అట్లీ, లోకేశ్ కనగరాజ్ లతో చేస్తున్న సినిమాలతో పాటుగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రానున్న ‘పుష్ప3’ (Pushpa 3) చిత్రం ముగిశాక 2028లో ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.

