‘పెద్ది’తో స్పెషల్‌ సాంగ్‌ చేయనున్న మృణాల్!

by | Jan 23, 2026 | సినిమా

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi) . ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుందట. ఆ పాటకి స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో స్టెప్పులేయించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం మృణాల్ ఠాకూర్ ను సంప్రదించారట. పాట నచ్చడంతో మృణాల్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. సినిమాకి ఓ హైలెట్‌గా నిలవనున్న ఈ పాటలో రామ్‌ చరణ్‌ (Ram Charan) తో కలిసి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) డ్యాన్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్‌.రెహమాన్‌ ఇప్పటికే అదిరిపోయే ట్యూన్‌ కంపోజ్ చేశారని తెలుస్తోంది. ‘సీతా రామం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ (Allu Arjun) , అట్లీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ‘పెద్ది’ (Peddi) లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు కెమేరామేన్‌గా చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమా మార్చి 27, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.