యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగెన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన రషెస్‌తో రిలీజ్‌కు ముందే ఈ మూవీ సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీ రోల్లో నటించబోతున్నాడన్న వార్త అటు బీటౌన్‌లో, ఇటు సౌత్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం అనిల్ కపూర్ ఈ సినిమాలో బలమైన పాత్రలో కనిపిస్తాడట. ఇప్పటికే ‘యానిమల్’ మూవీలో రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘డ్రాగన్’లో కూడా అంతే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐఎండీబీ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ సినిమాస్ లిస్ట్ లో ‘డ్రాగన్’ చోటు దక్కిన విషయాన్ని అనిల్ కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. ఏదేమైనా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌కు తోడు అనిల్ కపూర్ లాంటి స్టార్ జతకావడం ‘డ్రాగన్’ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

