మన శంకర వర ప్రాసాద్ గారి టీం ని చూశారా 

by | Jan 3, 2026 | సినిమా

‘మన శంకర వర ప్రసాద్ గారు’  ప్రొమోషన్స్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ‘మన శంకర వర ప్రసాద్ గారి స్క్వాడ్ కు సంబందించిన ఫోటో వదిలారు .

మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే.  ఆయన స్క్వాడ్ లో  క్యాథెరిన్ థెరిసా, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం లు ఉన్నారు. 

మన శంకర వర ప్రసాద్ గారు చిత్ర ట్రైలర్ ను తిరుపతిలో ఎస్ వి సినీప్లెక్స్ లో విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ నిడివి రెండు నిమిషాల 30 సెకండ్లు ఉన్నట్లు అనిల్ రావిపూడి ఎక్స్ ద్వారా తెలియచేశారు. ఈ ట్రైలర్ ను రేపు, అనగా జనవరి 4 ఆదివారం నాడు విడుదల చేయనున్నారు 

ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు అనిల్ రావిపూడి.  చిరంజీవి కూడా కొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.