ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోయే స్పిరిట్ చిత్రం ఈ రోజు పూజ కార్యక్రమంతో ప్రారంభమయ్యింది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అనిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి కధానాయిక గా నటిస్తోంది. భద్రకాళి పిక్చర్స్ తో కలిసి టి సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది
యాక్షన్ థ్రిల్లర్ గా రూపు దిద్దుకోబోతున్న ఈ చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ లు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారతీయ భాషలలోనే కాకుండా జాపనీస్, కొరియన్, మాండరిన్ లో కూడా విడుదల చేయనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఆడియో తో విడుదలైన టీజర్ తోనే ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్య అతిధిగా హాజరయిన చిరంజీవి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

