పైరసీ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. అందులోనూ 21000 సినిమాలను పైరసీ చేసిన ఐ బొమ్మ రవి చేసింది క్షమించరాని నేరం. రవికి సహకరించిన మూవీ రూల్జ్ వెబ్ సైట్ నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఐ బొమ్మ రవి కి ఫైనాన్సియల్ లావాదేవీల పై పోలీస్ లు ఆరా తీస్తున్నారు..
ఇక్కడ ఐ బొమ్మలో పైరసీ సినిమా చూసిన వాళ్ళు కూడా తప్పు చేసినట్లే. ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్త సినిమా విడుదలయితే చాలు సినిమాకు వెళ్లి మొబైల్ లో కొన్ని సీన్ లు తీసి సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ను సైత వదలట్లేదు. చాలా మంది ఈ సినిమాలోని సన్నివేశాలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. టికెట్ కొనుక్కుని సినిమా చూసి రాక మొబైల్ తో సినిమా లోని సన్నివేశాలను షూట్ చేసి సోషల్ మీడియా లో అప్ లోడ్ చేసే వాళ్ళు కూడా ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళే.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా కు టాక్ బాగానే ఉంది. సినిమా టికెట్ రేట్లు కూడా పెంచలేదు (కొంత మంది సినిమా టికెట్ రేట్లు పెంచడం పై ఏడుస్తున్నారు). సాధారణ టికెట్ రేట్లు ఉన్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా సన్నివేశాలను సైతం మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియా లో పెట్టడం ఎంత వరకు సమంజసం. బాగా చదువుకున్న వాళ్లే ఇలాంటి పనులు చేస్తున్నారు ఇదొక పైశాచికానందం. ఈ సినిమాకు ప్రాణం క్లైమాక్స్ . ఈ సన్నివేశాలను సైతం సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తున్నారు
ఈ సమాజంలో ఐ బొమ్మ రవి ఒక్కడే నేరస్థుడు కాదు, ఐ బొమ్మలో సినిమా చూసే వాళ్ళు, థియేటర్ లో సినిమాలను మొబైల్ తో చిత్రీకరించిన సోషల్ మీడియా లో పోస్ట్ చేసేవాళ్ళు కూడా నేరస్థులే. వీరందరూ, సామజిక స్పృహ, బాధ్యత లేని వాళ్ళే. ఈ విషయం లో కఠిన చట్టాలు రావలసిందే
ఇదే జరిగితే భవిష్యత్తులో మొబైల్ ఫోన్ ల ను థియేటర్ల లోకి అనుమతించకపోవచ్చు. సోషల్ మీడియా నియంత్రణ కు ప్రత్యేక చట్టాలు రావాలి

