మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిబ్రవరి 6 నుండి జరగ బోయే వన్ డే సిరీస్ కు ఎంపికయ్యాడు
ఇటీవల ముగిసిన 5 మ్యాచ్ ల టి 20 సిరీస్ లో 14 వికెట్లు తీసి ప్లేయర్ అఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు వరున్ చక్రవర్తి. మూడవ టి 20 మ్యాచ్ లో 5 వికెట్లు కూడా తీసుకున్నాడు.
టి 20 సిరీస్ లో రాణించిన వరుణ్ చక్రవర్తి కి, నాగపూర్ లో ఉన్న భారత జట్టు తో జాయిన్ అవమని సెలక్షన్ కమిటీ సమాచారం అందించింది
ఇంతకు ముందు వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ తో వన్ డే సిరీస్ కు, ఛాంపియన్స్ ట్రోఫీ కు ఎంపిక కాలేదు. అయితే 5 మ్యాచ్ ల టి 20 లో వరుణ్ ప్రదర్శనను చూసిన సెలక్షన్ కమిటీ మొదట ఇంగ్లాండ్ తో వన్ డే సిరీస్ కు ఎంపిక చేసింది.
ఫిబ్రవరి 6 న మొదటి వన్ డే నాగపూర్ లో జరుగుతుంది. వరుణ్ చక్రవర్తి కి ఇదే మొదటి వన్ డే అవుతుంది
టి 20 మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో తడబడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు వన్ డేల్లో ఎలా ఆడతారో చూడాలి
ఇంగ్లాండ్ తో వన్ డే సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా, శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు

