సంధ్య థియేటర్ ఘటనపై , అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద స్థాయినుంచి ఎదిగిన గొప్ప నాయకుడని అన్నారు. బెనిఫిట్ షో ల కు పర్మిషన్ ఇవ్వడం, టికెట్ ధరలను పెంచడం వంటి విషయాలలో ప్రభుత్వం సపోర్ట్ చేసింది.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులను నిందించడం తగదు. అసలు ఏం జరిగిందో పూర్తి గా నాకు తెలియదని చెప్పారు. అయితే థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ లు మధ్య సమన్వయ లోపం జరిగిందని అన్నారు. థియేటర్ ముందుగా అల్లు అర్జున్ కు సమాచారం ఇవాల్సిఉందని అన్నారు.
సంఘటన జరిగిన వెంటనే, మానవతా దృక్పధంతో, అభిమాని ఇంటి కి వెళ్లి సంతాపం తెలిపి ఉండాల్సింది, పరామర్శించాల్సింది. కనీసం చిత్రం బృందమైన వెళ్లి ఉండాల్సింది, పరామర్శించాల్సింది.
అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు సరిగా పలకలేదని అరెస్ట్ చేశారనడం సరైనది కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదని, చట్టం ముందు అందరు సమానులే అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు

