సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) , దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వారణాసి’. (Varanasi) భారత సినీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఆశయంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ (Teaser) ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందనను తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 07, 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించాడు. అయితే, ఈ రిలీజ్ డేట్ పోస్టర్ వచ్చిన వెంటనే ఓ కొత్త న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ‘వారణాసి’ చిత్రాన్ని రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ సమయంలో రిలీజ్ చేసిన పోస్టర్లో #గ్లోబ్ ట్రాట్టర్ తో పాటుగా #టైమ్ ట్రాట్టర్ (Time Trotter) అనే రెండు హ్యాష్ట్యాగ్లు కనిపించాయి. కానీ ఇప్పుడు వచ్చిన విడుదల తేదీ పోస్టర్లో మాత్రం కేవలం #గ్లోబ్ ట్రాట్టర్ (Globe Trotter) అని మాత్రమే ఉంది. దీంతో ఈ మూవీ రెండు భాగాలుగా రానుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం వారణాసి తొలి భాగం #గ్లోబ్ ట్రాట్టర్ లో మహేష్ బాబు (Mahesh Babu) ఈ ప్రపంచాన్ని చుట్టేసే యోధుడిగా కనిపిస్తాడని అలాగే ఈ సినిమా రెండో భాగం #టైమ్ ట్రాట్టర్ లో కాలాన్ని దాటి ప్రయాణించే వీరుడిగా కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తుండగా, కథ విజయేంద్ర ప్రసాద్ అందించారు.


